శ్రీమన్నారాయణ

పల్లవి:
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ।
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ।।

చరణం:
కమలాసతీ ముఖకమల కమలహిత ।
కమలప్రియ కమలేక్షణ ।
కమలాసనహిత గరుడగమన శ్రీ ।
కమలనాభ నీ పదకమలమే శరణు ।।

పరమయోగిజన భాగ్యధేయ శ్రీ ।
పరమపూరుష పరాత్పర
పరమాత్మ పరమాణురూప శ్రీ ।
తిరువేంకటగిరి దేవ శరణు ।।

Devotional Music

Devotional Music

భక్తి పాటలు

Click on any topic to open

Copyright © 2025 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Whatsapp Group Icon
Have questions on Sanatana Dharma? Ask here...