గరుడగమన రారా

గరుడగమన రారా నను నీ కరుణ నేలుకోరా
పరమ పురుష యే వెరపు లేక నీ మరుగు జొచ్చితి నన్నరమర సేయకు
పిలువగానే రమ్మి నాకభయము తలపగానే యిమ్మి
కలిమి బలిమి నా కిలలోనివని కలవరించితిని నలువను గన్నయ్య
పాల కడలిశయన దశరథ బాల జలజ నయన
పాలముంచు నను నీళ్ళముంచు నీపాల బడితి నికజాలము సేయకు
ఏల రావు స్వామి నను నిపుడేవకోవదేమి
ఏలువాడని చాల నమ్మితి నేల రావు కరుణాలవాల హరి
ఇంత పంతమేల భద్రగిరీష వర కృపాళ చింతలణచి
శ్రీ రామదాసునియంతరంగ పతియై రక్షింపుమి

 

 

13.0K

Comments

jicj6

ఋషులలో మొదటివారు ఎవరు?

వరుణడు చాక్షుష మన్వంతరం ముగింపుకి ముందు ఏడుగురు ఋషులు పుట్టడానికి కారణమైన ఒక యాగం చేశాడు. భృగుడు ఆ హోమ కుండం నుండి మొదట ఉద్భవించాడు.

శ్రీమద్భాగవతం రచయిత ఎవరు?

వ్యాస మహర్షి శ్రీమద్భాగవతం రచయిత. ఆయనను వేదవ్యాసుడు అని కూడా అంటారు.

Quiz

సంతానం కలగాలని వ్యాస మహర్షిని ఎవరు అనుగ్రహించారు?
Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |