బ్రంహమొక్కటే

తందనాన అహి తందనాన పురె
తందనాన భళా తందనాన
బ్రహ్మమొక్కటె పర బ్రహ్మమొక్కటె
పరబ్రహ్మమొక్కటె పర బ్రహ్మమొక్కటె
కందువగు హీనాధికములిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మంతానొక్కటె
అందరికి శ్రీహరే అంతరాత్మ
నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటె
అంటనే బంటునిద్ర అదియు నొకటె
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటె
చండాలు డుండేటి సరిభూమి యొకటే
కడగి యేనుగు మీద కాయు యెండొకటే
పుడమి శునకము మీద బొలయు యెండొకటే
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వరుని నామమొకటె

 

Bramham Okate by Singer Vijay Prakash

 

44.0K

Comments

27chu

వ్యాసుడు వేదాన్ని నాలుగు భాగాలుగా ఎందుకు విభజించాడు?

1.నేర్చుకునే సౌలభ్యం కోసం. 2.యజ్ఞాలలో వాటి అన్వయం ఆధారంగా వేదం విభజించబడింది మరియు సంకలనం చేయబడింది. వేదవ్యాసుడు యజ్ఞాలు చేయడంలో ఉపయోగపడే వేదాలలో కొంత భాగాన్ని మాత్రమే విభజించి సంగ్రహించాడని మీరు గుర్తుంచుకోవాలి. దీనిని యజ్ఞమాత్రికవేదం అంటారు.

వ్యాస మహర్షిని వేదవ్యాసుడు అని ఎందుకు అంటారు?

ఎందుకంటే అతను వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు - ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వవేదం.

Quiz

మహాభారతాన్ని అసలు ఏమని పిలిచేవారు?
Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |