పూర్వాషాడ నక్షత్రం

Purvashada Nakshatra symbol winnow

 

ధనస్సు రాశి 13 డిగ్రీల 20 నిమిషాల నుండి 26 డిగ్రీల 40 నిమిషాల వరకు వ్యాపించే నక్షత్రాన్ని  పూర్వాషాఢ అంటారు. వేద ఖగోళ శాస్త్రంలో ఇది 20వ నక్షత్రం. ఆధునిక ఖగోళ శాస్త్రంలో, పూర్వాషాడ అనేది δ Kaus Media and ε Kaus Australis Sagittariiకి అనుగుణంగా ఉంటుంది.

లక్షణాలు

పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు:

  • అందమైనవారు
  • ఆకర్షణీయమైనవారు
  • తెలివైనవారు
  • విసాలమనస్తత్వం కలవారు
  • మధురంగా మాట్లాడుతారు
  • స్నేహితుల పట్ల చిత్తశుద్ధి
  • ఆప్యాయంగా ఉంటారు
  • సహాయకారులు
  • ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇస్తారు
  • చాలమంది స్నేహితులు ఉంటారు
  • ఆశావాది
  • స్వీయ గౌరవం
  • తల్లిదండ్రుల నుంచి పెద్దగా సపోర్ట్ ఉండదు
  • మధ్యవయస్సులో సంపన్నత
  • కళల పట్ల ఆసక్తి.
  • మతం పట్ల ఆసక్తి.
  • మృదువైన స్వభావం ఉంటుంది
  • అణకువగా ఉంటారు
  • సహనశీలి
  • ఉన్నత జీవన ప్రమాణం
  • స్త్రీలు పొగిడే ధోరణిని కలిగి ఉంటారు

ప్రతికూల నక్షత్రాలు

  • శ్రవణం
  • శతభిష
  • ఉత్తరాభాద్రా
  • పునర్వసు - కర్క రాశి
  • పుష్యమి
  • ఆశ్లేష

పూర్వాషాడ నక్షత్రంలో జన్మించిన వారు ఈ రోజుల్లో ముఖ్యమైన సంఘటనలకు దూరంగా ఉండాలి మరియు ఈ నక్షత్రాలకు చెందిన వారితో భాగస్వామ్యాన్ని కూడా నివారించాలి. 

ఆరోగ్య సమస్యలు

పూర్వాషాడ నక్షత్రంలో జన్మించిన వారు ఈ ఆరోగ్య సమస్యలకు లోనవుతారు:

  • ఆర్థరైటిస్
  • సయాటికా
  • వెన్నునొప్పి
  • మధుమేహం
  • అజీర్ణత
  • కిడ్నీ కణితి (ట్యూమర్)
  • క్యాన్సర్
  • శ్వాసకోశ వ్యాధులు
  • మోకాళ్ల సమస్యలు
  • జలుబు - దగ్గు
  • రక్త రుగ్మతలు.
  • బలహీనత

అనుకూలమైన కెరీర్

పూర్వాషాడ నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు: 

  • న్యాయవాద వృత్తి
  • బ్యాంక్
  • ప్రభుత్వ ఉద్యోగం
  • పశువుల పెంపకం
  • సామాజిక సేవ
  • రైల్వే
  • రవాణా
  • విమానయానం
  • పట్టు
  • నార
  • రబ్బరు
  • చక్కెర
  • నర్సరీ
  • సంగీతం
  • హోటల్
  • అంతర్జాతీయ వాణిజ్యం
  • ఆరోగ్య పరిశ్రమ

పూర్వాషాడ నక్షత్రం వారు వజ్రాన్ని ధరించవచ్చా?

ధరించవచ్చు.

అదృష్ట రాయి 

వజ్రం 

అనుకూలమైన రంగులు

తెలుపు, పసుపు.

పూర్వాషాడ నక్షత్రానికి పేర్లు

పూర్వాషాడ నక్షత్రానికి అవకాహదాది విధానం ప్రకారం పేరు యొక్క ప్రారంభ అక్షరం: 

మొదటి చరణం - భూ.

రెండవ చరణం - ధా

మూడవ చరణం - ఫా

నాల్గవ చరణం - ఢా

నామకరణ వేడుక సమయంలో ఉంచబడిన సాంప్రదాయ నక్షత్ర పేరు కోసం ఈ అక్షరాలను ఉపయోగించవచ్చు.

 కొన్ని సంఘాల్లో నామకరణం సమయం లో తాతయ్య-నానమ్మల పేర్లను ఉంచుతారు.

ఆ వ్యవస్థను అనుసరించడం వల్ల ఎలాంటి నష్టం లేదు. 

రికార్డులు మరియు అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉంచబడిన అధికారిక పేరు దీనికి భిన్నంగా ఉండాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. 

దీనిని వ్యవహారిక నామం అంటారు. 

పైన పేర్కొన్న విధానం ప్రకారం నక్షత్రం పేరు సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి. 

పూర్వాషాడ నక్షత్రంలో జన్మించిన వారి అధికారిక పేరుతో మీరు దూరంగా ఉండవలసిన అక్షరాలు :- ఉ, ఊ, ఋ, ష, ఎ, ఐ, హ, చ, ఛ, జ, ఝ.

వివాహం

పూర్వాషాడ నక్షత్రంలో జన్మించిన వారు మృదువుగా, సౌమ్యంగా ఉంటారు. మంచి జీవిత భాగస్వామ్యంగా ఉంటారు.  స్త్రీలకు వివాహంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. 

నివారణలు

పూర్వాషాడ నక్షత్రంలో పుట్టిన వారికి చంద్ర, శని, రాహు కాలాలు సాధారణంగా 

ప్రతికూలంగా ఉంటాయి. 

వారు ఈ క్రింది నివారణలను చేయవచ్చు. 

మంత్రం

 ఓం అద్భ్యో నమః

పూర్వాషాడ నక్షత్రం

  • భగవంతుడు - ఆపః (నీరు)
  • పాలించే గ్రహం - శుక్రుడు
  • జంతువు - కోతి
  • చెట్టు - Salix tetrasperma
  • పక్షి - కోడి
  • భూతం - వాయు
  • గణం - మనుష్య
  • యోని - కోతి (మగ)
  • నాడి - మధ్య.
  • చిహ్నం - చాట

 

18.5K

Comments

nmr5y

బ్రహ్మవాదినీ మరియు ఋషికాలు ఒకరేనా?

బ్రహ్మవాదీ అంటే వేదాల యొక్క శాశ్వతమైన జ్ఞానం గురించి మాట్లాడే వ్యక్తి. బ్రహ్మవాదినీ ఒక మహిళా పండితురాలు, బ్రహ్మవాది యొక్క స్త్రీ లింగం. ఒక ఋషి ఒక పురుషుడు, వీరికి ఒక మంత్రం వెల్లడి చేయబడింది. ఒక ఋషికా ఒక స్త్రీ, వీరికి ఒక మంత్రం వెల్లడి చేయబడింది. ఋషికులందరూ బ్రహ్మవాదినీలే, కానీ బ్రహ్మవాదినీ అందరూ ఋషికులు కాకూడదు.

హనుమాన్ జీ ఏ లక్షణాలు లేదా సద్గుణాలను సూచిస్తాడు?

హనుమాన్ జీ భక్తి, విధేయత, ధైర్యం, బలం, వినయం మరియు నిస్వార్థతకు ప్రతీక. ఇది మీ స్వంత జీవితంలో ఈ సద్గుణాలను పొందుపరచడానికి, వ్యక్తిగత ఎదుగుదల మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంపొందించడానికి మీకు స్ఫూర్తినిస్తుంది మరియు మార్గనిర్దేశం చేస్తుంది

Quiz

విశ్వామిత్రుడు ఏ దేశానికి రాజు?

అనువాదం : వేదుల జానకి

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |