హనుమాన్ చాలీసా అనేది గోస్వామి తులసీదాస్ జీ స్వరపరిచిన భక్తి గీతం, ఇది హనుమాన్ స్వామి యొక్క సద్గుణాలు మరియు పనులను కీర్తిస్తుంది. రక్షణ, ధైర్యం మరియు ఆశీర్వాదం కోసం అవసరమైన సమయాల్లో లేదా రోజువారీ దినచర్యలో భాగంగా మీరు దీనిని పఠించవచ్చు.
అవును. హనుమంతుడు ఇంకా బతికే ఉన్నాడు. ఎక్కువగా గంధమాదన పర్వతం పైన తపస్సులో మునిగి ఉంటాడు. శ్రీరాముని అవతారం 24వ త్రేతాయుగంలో అయింది. ప్రస్తుత ఇరవై ఎనిమిదవ(28) చతుర్యుగం తాలుక, ద్వాపరయుగంలో, దాదాపు ఒక కోటి డబ్భై అయిదు లక్షల సంవత్సరాల తరువాత, సౌగంధికా పుష్పాలను పొందేందుకు వెళ్లినప్పుడు, భీముడు అతనిని కలిశాడు. ఎనిమిది మంది చిరంజీవిలలో హనుమంతుడు ఒకడు. అతను రెండు వందల ముప్ఫై అయిదు కోట్ల తొంభై ఒక లక్షల నలబై ఆరు వేల ఎనిమిది వందల డబ్భై ఏడు (2,35,91,46,877) సంవత్సరాల దూరంలో ఉన్న కల్పం ముగిసే వరకు జీవించే ఉంటాడు.
ఓం క్ష్రౌం ప్రౌం హ్రౌం రౌం బ్రౌం జ్రౌం జ్రీం హ్రీం నృసింహాయ నమః .....
ఓం క్ష్రౌం ప్రౌం హ్రౌం రౌం బ్రౌం జ్రౌం జ్రీం హ్రీం నృసింహాయ నమః .