నగు మోము కన లేని

 

నగు మోము కన లేని నా జాలి తెలిసి
నన్ను బ్రోవ రాదా శ్రీ రఘువర నీ (నగు)

నగ రాజ ధర నీదు పరివారులెల్ల
ఒగి బోధన జేసె వారలు కారేయ్ ఇటులుండుదురే నీ (నగు)

ఖగ రాజు నీ యానతి విని వేగ చన లేడో
గగనానికి ఇలకు బహు దూరంబనినాడో
జగమేలే పరమాత్మ ఎవరితో నే మొరలిడుదు
వగ జూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజ నుత నీ (నగు)

 

41.8K

Comments

pdmrv
Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |