Ashtalakshmi Stothram

 

సుమనసవందితసుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే
మునిగణమండితమోక్షప్రదాయిని మంజులభాషిణి వేదనుతే.
పంకజవాసిని దేవసుపూజితసద్గుణవర్షిణి శాంతియుతే
జయజయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం.
అయి కలికల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే
క్షీరసముద్భవమంగలరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే.
మంగలదాయిని అంబుజవాసిని దేవగణాశ్రితపాదయుతే
జయజయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం.
జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే
సురగణపూజితశీఘ్రఫల- ప్రదజ్ఞానవికాసిని శాస్త్రనుతే.
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రితపాదయుతే
జయజయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం.
జయజయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రదశాస్త్రమయే
రథగజతురగపదాతిసమావృత- పరిజనమండితలోకనుతే.
హరిహరబ్రహ్మసుపూజిత- సేవితతాపనివారిణి పాదయుతే
జయజయ హే మధుసూదనకామిని గజలక్ష్మిరూపేణ పాలయ మాం.
అహిఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారిధిలోకహితైషిణి స్వరసప్తభూషితగాననుతే.
సకలసురాసురదేవ- మునీశ్వరమానవవందితపాదయుతే
జయజయ హే మధుసూదనకామిని సంతానలక్ష్మి త్వం పాలయ మాం.
జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే
అనుదినమర్చితకుంకుమధూసర- భూషితవాసితవాద్యనుతే.
కనకధరాస్తుతివైభవ- వందితశంకరదేశికమాన్యపదే
జయజయ హే మధుసూదనకామిని విజయలక్ష్మి సదా పాలయ మాం.
ప్రణతసురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే
మణిమయభూషితకర్ణవిభూషణ- శాంతిసమావృతహాస్యముఖే.
నవనిధిదాయిని కలిమలహారిణి కామితఫలప్రదహస్తయుతే
జయజయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం.
ధిమిధిమిధింధిమిధింధిమి- ధింధిమిదుందుభినాదసుపూర్ణమయే
ఘుమఘుమఘుంఘుమ- ఘుంఘుమఘుంఘుమ- శంఖనినాదసువాద్యనుతే.
వేదపురాణేతిహాససుపూజిత- వైదికమార్గప్రదర్శయుతే
జయజయ హే మధుసూదనకామిని ధనలక్ష్మిరూపేణ పాలయ మాం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

166.9K
25.0K

Comments Telugu

Security Code

97298

finger point right
చాలా బాగుంది -వాసు దేవ శర్మ

వేదాద్దర వలన ఎన్నో విషయాలు తెలుసు కుంటున్నాను వేదాలు శ్లోకాలు మంత్రాలూ అన్ని రకాలుగా తెలియపార్చిన వేదాదారకు కృతజ్ఞతలు -బద్రాచలం తరకేశ్వర్

ఈ గ్రూప్ చాల ఉపయుక్తంగా వుంది ఇలాంటి గ్రూప్ ఏర్పాటు చేయాలని ఉద్దేశం కలిగిన వారికి ఈ గ్రూప్ ని నిర్వహిస్తున్న వారికి నా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు ఆ కామాక్షి పర దేవత యొక్క అనుగ్రహం మీకు కలగాలని ఆశిస్తున్నాము -మానేపల్లి .అదిత్యాచార్య

సమగ్ర సమాచారంతో 🙏🙏 -మాకుమాగులూరి చంద్ర

ప్రత్యేకమైన వెబ్‌సైట్ 🌟 -కొల్లిపర శ్రీనివాస్

Read more comments

Other languages: EnglishHindiMalayalamTamilKannada

Recommended for you

శారదా స్తోత్రం

శారదా స్తోత్రం

నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే �....

Click here to know more..

రాధా వందన స్తోత్రం

రాధా వందన స్తోత్రం

వ్రజంతీం సహ కృష్ణేన వ్రజవృందావనే శుభాం .. దివ్యసౌందర్యస�....

Click here to know more..

తీర్థయాత్రల నుండి ఎవరు నిజంగా లాభపడతారు?

తీర్థయాత్రల నుండి ఎవరు నిజంగా లాభపడతారు?

Click here to know more..