ఎండి కొండాలు ఏలేటోడా...
అడ్డబొట్టు శంకరుడా...
జోలే వట్టుకోనీ తిరిగెటోడా...
జగాలను గాసే జంగముడా.....
.....
ఎండి కొండాలు ఏలేటోడా...
అడ్డబొట్టు శంకరుడా....
జోలే వట్టుకోనీ తిరిగెటోడా...
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినోడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
ఆది అంతాలు లేనివాడా...
అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా
నాగభరణుడా...నంది వాహనుడా
కేదారినాధుడా...కాశీవిశ్వేశ్వరుడా
భీమా శంకరా...ఓం కారేశ్వరా
శ్రీ కాళేశ్వరా...మా రాజరాజేశ్వరా
ఎండి కొండాలు ఏలేటోడా..అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా..
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినోడా...
కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
ఆది అంతాలు లేనివాడా...
అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా...
......
పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే
పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే
పలరాలు పంచేరే...పలరాలు పంచేరే
గండాదీపాలు ఘనముగా వెలిగించేరే
గండాలు పాపమని పబ్బతులు పట్టేరే
పబ్బతులు పట్టేరే
లింగనా రూపాయి తంబాన కోడేను...
కట్టినా వారికి సుట్టనీవే
తడిబట్ట తానలు గుడి సుట్టు దండాలు
మొక్కినా వారికీ దిక్కు నీవేలే
వేములవాడ రాజన్న శ్రీశైల మల్లన్న
ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడావే
పలికేటి దేవుడావే
కోరితే కోడుకులనిచ్చి...
అడిగితే ఆడబిడ్డలనిచ్చే
తీరు తీరు పూజాలనొందే...మా ఇంటి దేవుడవే
ఎండి కొండాలు ఏలేటోడా..అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా..
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినోడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా
....
నీ ఆజ్ఞా లేనిదే చీమైనా కుట్టదే
నరులకు అందని నీ లీలలూ చిత్రాలులే
లీలలూ చిత్రాలులే
కొప్పులో గంగమ్మ పక్కన పార్వతమ్మ
ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడవే
ముక్కంటిశ్వరుడవే
నిండొక్క పొద్దులూ దండి నైవేద్యాలు
మనసారా నీ ముందు పెట్టినమే
కైలాసావాసుడా కరుణాలాదేవుడా
కరునించామని నిన్నూ వేడుకుంటామే
త్రీలోక పూజ్యూడా... త్రీశూల ధారుడా
పంచభూతాలకు అధిపతివి నీవూరా
అధిపతివినీవురా
శరణుఅని కొలిచినా వరములనిచ్చే దొరా
అభిషేకప్రియుడా ఆద్వైత్వా భస్కరుడా
దేవనా దేవుళ్లు మెచ్చినొడా
ఒగ్గూ జెగ్గుల పూజలు అందినోడా
ఆనంత జీవా కోటిని ఏలినోడా
నీవు అత్మాలింగనివిరా మాయలోడా
......
కోటి లింగాల దర్శనం ఇచ్చేటోడా
కురవి వీరన్న వై దరీకీ చేరీనోడా
నటరాజు నాట్యాలు ఆడెటొడా
నాగుపాము ను మెడసుట్టూ సుట్టినోడా
నాగభరనుడా నంది వాహనుడా
కేథారి నాధుడా కాశీ విశ్వేశ్వరుడా
భీమా శంకరా ఓంకారేశ్వరా
శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వర
ఎండి కొండాలు ఏలేటోడా
అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినోడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా...
అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా...
అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా...
ఋషి అంటే కొంత శాశ్వతమైన జ్ఞానం వెల్లడి చేయబడిన వ్యక్తి. అతని ద్వారా, ఈ జ్ఞానం మంత్రం రూపంలో వ్యక్తమవుతుంది. ముని అంటే జ్ఞాని, తెలివైనవాడు మరియు లోతైన ఆలోచనా సామర్థ్యం ఉన్నవాడు. మునిలకు కూడా తాము చెప్పేదానిపై నియంత్రణ ఉంటుంది.
ప్రహ్లాదుని ప్రకారం, భక్తి యొక్క తొమ్మిది రూపాలు - 1. శ్రవణం - భగవాన్ మహిమను వినడం (ఉదా. పరీక్షిత్) 2. కీర్తన - అతని కీర్తిని గానం చేయడం (ఉదా. శుకదేవుడు) 3. స్మరణ - నిరంతరం అతనిని స్మరించడం (ఉదా. ప్రహ్లాదుడు) 4. పాదసేవన - అతని పాద పద్మాలను సేవించడం (ఉదా. లక్ష్మి) 5. అర్చన - భౌతిక పూజ (ఉదా. పృథు) 6. వందన - నమస్కారాలు (ఉదా. అకృరుడు) 7. దాస్య - మిమ్మల్ని భగవాన్ సేవకుడిగా భావించడం (ఉదా. హనుమంతుడు) 8. సఖ్య - అతనిని మీ స్నేహితుడిగా పరిగణించడం (ఉదా. అర్జునుడు) 9. ఆత్మనివేదన - భగవాన్‌కు పూర్తిగా లొంగిపోవడం (ఉదా. బలి రాజు).
నారాయణ అష్టాక్షర మంత్రం
ఓం నమో నారాయణాయ....
Click here to know more..వంద సంవత్సరాలు సంతోషంగా మరియు ఆరోగ్యంగా జీవించడానికి మంత్రం
పశ్యేమ శరదః శతం ..1.. జీవేమ శరదః శతం ..2.. బుధ్యేమ శరదః శతం ..3.. రో....
Click here to know more..శారదా మహిమ్న స్తోత్రం
విజ్ఞానదాయాఖిలభోగదాయ శ్రీశారదాఖ్యాయ నమో మహిమ్నే. తుంగ�....
Click here to know more..