శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..
శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ
ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి.. ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి..
మురిపించి లాలించి..మూచ్చటల తేల్చి.. శేషశైలావాస శ్రీవెంకటేశా..
పట్టు పానుపుపైన పవళించర స్వామి..
పట్టు పానుపుపైన పవళించర స్వామి.. భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ..
చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము..
చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము.. కరువుదీర కాంచి తరియించుమూ మేము.
శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..
శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..
క్షీరసాగరం అనేది దివ్యమైన ఆవు, సురభి నుండి ప్రవహించిన పాలతో ఏర్పడిన సముద్రం.
వేదాల బోధనలు హిందువులకే కాదు, మానవులందరికీ ఉద్దేశించబడ్డాయి.