ఓం నమో గోవర్ధనోద్ధరణాయ గోవిందాయ గోకులనివాసాయ గోపాలాయ గోపాలపతయే గోపీజనభర్త్రే గిరిజోద్ధర్త్రే కరుణానిధయే జగద్విధయే జగన్మంగలాయ జగన్నివాసాయ జగన్మోహనాయ కోటిమన్మథమన్మథాయ వృషభానుసుతావరాయ శ్రీనందరాజకులప్రదీపాయ శ్రీకృష్ణాయ పరిపూర్ణతమాయ త్వసంఖ్యబ్రహ్మాండపతయే గోలోకధామధిషణాధిపతయే స్వయం భగవతే సబలాయ నమస్తే నమస్తే నమస్తే .
అవును. హనుమంతుడు ఇంకా బతికే ఉన్నాడు. ఎక్కువగా గంధమాదన పర్వతం పైన తపస్సులో మునిగి ఉంటాడు. శ్రీరాముని అవతారం 24వ త్రేతాయుగంలో అయింది. ప్రస్తుత ఇరవై ఎనిమిదవ(28) చతుర్యుగం తాలుక, ద్వాపరయుగంలో, దాదాపు ఒక కోటి డబ్భై అయిదు లక్షల సంవత్సరాల తరువాత, సౌగంధికా పుష్పాలను పొందేందుకు వెళ్లినప్పుడు, భీముడు అతనిని కలిశాడు. ఎనిమిది మంది చిరంజీవిలలో హనుమంతుడు ఒకడు. అతను రెండు వందల ముప్ఫై అయిదు కోట్ల తొంభై ఒక లక్షల నలబై ఆరు వేల ఎనిమిది వందల డబ్భై ఏడు (2,35,91,46,877) సంవత్సరాల దూరంలో ఉన్న కల్పం ముగిసే వరకు జీవించే ఉంటాడు.
శివ పురాణం నుదురు, రెండు చేతులు, ఛాతీ మరియు నాభిపై భస్మాన్ని పూయాలని సిఫార్సు చేస్తోంది