పల్లవి

పలుకే బంగారమాయెనా కోదండ పాణి ||

అనుపల్లవి

పలుకే బంగారమయె పిలిచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరవ చక్కని తండ్రి
|| పలుకే ||

చరణములు

ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి
|| పలుకే ||

రాతినాతిగ జేసి భూతలమున
ప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి
|| పలుకే ||

ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు
పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి
|| పలుకే ||

శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాదా
కరుణించు భద్రాచల వర రామదాస పోష
|| పలుకే ||

94.4K
14.2K

Comments

Security Code

54998

finger point right
Very good -J.sreedhar

JEEVITHANIKI UPAYOGAKARAMYNA "VEDADARA" KU VANDANALU -User_sq9fei

అందరికీ మంచి మంచి వీడియోలు పంపిస్తున్నారు ధన్య వాదములు -User_spncsu

Ee vedhadhara valla nenu chala విషయాలను తెలుసుకుంటున్న -User_snuo50

🙏 చాలా సమాచారభరితమైన వెబ్‌సైట్ -వేంకటేష్

Read more comments

Knowledge Bank

సనాతన ధర్మంలో ఆచారాల అభివృద్ధి

సనాతన ధర్మం, శాశ్వత మార్గం, స్థిరమైన ముఖ్యమైన విలువలను కలిగి ఉంటుంది. అయితే, దాని ఆచారాలు మరియు సంప్రదాయాలు అభివృద్ధి చెందాయి మరియు ప్రస్తుతానికి అనుగుణంగా ఉండటానికి కొనసాగించాలి. హిందూ ధర్మం, అన్ని ఆచారాలతో కలిపి, మార్పులేని అని కొందరు నమ్ముతారు. ఈ దృష్టికోణం చరిత్ర మరియు పవిత్ర గ్రంథాలను తప్పుగా అర్థం చేసుకుంటుంది. సనాతన ధర్మం శాశ్వత సూత్రాలను కలిగి ఉన్నప్పటికీ, ప్రతీ నియమం మరియు ఆచారం స్థిరంగా ఉందని దాని అర్థం కాదు. హిందూ తత్వశాస్త్రం స్థాన (దేశం), కాలం (సమయం), వ్యక్తి (పాత్ర), యుగధర్మ (యుగానికి ధర్మం), మరియు లోకాచారం (స్థానిక ఆచారాలు) ఆధారంగా ఆచారాలను అనుసరించే ప్రాముఖ్యతను ప్రాముఖ్యతను ఇస్తుంది. ఈ అనుకూలత సనాతన ధర్మం ప్రాసంగికంగా ఉండటాన్ని నిర్ధారిస్తుంది. అభివృద్ధి చెందిన ఆచారాలు సంప్రదాయం యొక్క వృద్ధి మరియు జీవశక్తికి అవసరం. పాత ఆచారాలకు కఠినంగా కట్టుబడటం అవి ఈ కాలానికి అనుకూలంగా లేని మరియు సంబంధం లేని వాటిగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి, ముఖ్యమైన విలువలు స్థిరంగా ఉంటే, ఆచారాల అభివృద్ధి సనాతన ధర్మం యొక్క సుదీర్ఘ ప్రాసంగికత మరియు జీవంతతను నిర్ధారిస్తుంది.

రామాయణంలో కైకేయి చర్యలను సమర్థించడం

రాముని వనవాసంపై కైకేయి పట్టుబట్టడం ముఖ్యమైన సంఘటనల ఆవిష్కరణకు కీలకమైనది. రావణుడి బాధలో ఉన్న దేవతల ప్రార్థనలకు సమాధానంగా పరమాత్మ అవతరించాడు. కైకేయి రాముని వనవాసానికి పట్టుబట్టి ఉండకపోతే, సీతా అపహరణతో సహా ఆ తర్వాత జరిగిన సంఘటనల పరంపర జరిగేది కాదు. సీత అపహరణ లేకుండా రావణుడి పరాజయం జరిగేది కాదు. ఆ విధంగా, కైకేయి యొక్క చర్యలు దైవ ప్రణాళికలో కీలకమైనవి.

Quiz

భగవద్గీతను శైవ దృక్కోణం నుండి ఎవరు అర్థం చేసుకున్నారు?

Recommended for you

దుర్గా సప్తశతీ - ప్రాధానిక రహస్యం

దుర్గా సప్తశతీ - ప్రాధానిక రహస్యం

అథ ప్రాధానికం రహస్యం . అస్య శ్రీసప్తశతీరహస్యత్రయస్య . బ�....

Click here to know more..

తోకలేని తిమ్మరాజు

తోకలేని తిమ్మరాజు

Click here to know more..

సంతాన గోపాల స్తోత్రం

సంతాన గోపాల స్తోత్రం

అథ సంతానగోపాలస్తోత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం. దేవకీ�....

Click here to know more..