గరుడ పురాణము
వాసుకి పరుగెడుతున్నపుడు అతని రక్షణలోనున్న బలాసురుని పిత్తం నుండి కొన్ని బిందువులు జారిపడుతుండగా గరుత్మంతుడు వాటిని అందుకొని పానం చేశాడు. వెంటనే ఆయనకి మైకం కమ్మేసినట్లుగా కావడంతో ఆయన దానిని వమనం, కక్కివేయుట చేశాడు. ఆయన రెండు నాసికారంధ్రాల ద్వారా వెలువడి నేలపైబడిన ఆ పిత్తభాగము అద్భుత కాంతితో మెరిసే మరకతాలకు గనిగా మారింది. ఆ మహామణులు కోమలమైన చిలుక వన్నెలోనూ, శిరీష పుష్ప వర్ణంలోనూ, మిణుగుడు పురుగు వెనుకభాగం రంగులోనూ, హరిత తృణక్షేత్రంవలెనూ, నాచురంగులోనూ, సర్పభక్షిణి నెమలి కన్నుల వన్నెలలోనూ నవహరిత పత్రవర్ణంలోనూ మెరుస్తుంటాయి. ఇవి లోకకళ్యాణ కారకాలు. గరుత్మంతుని స్పర్శ వలనయోమో గాని ఇక్కడి మరకతమణులు సర్వవిషవ్యాధులనూ నశింపజేసే శక్తిని కలిగి వుంటాయి. అయితే ఇవి దుర్లభాలు; దొరకడం చాలా కష్టం. ఎన్నో మంత్రాలకూ, మరెన్నో ఔషధాలకూ లొంగని విషాలు కూడా గరుత్మంతుని మూలంగా వచ్చిన రత్నాలు తగలగానే పటాపంచలై పోతాయి.
గరుత్మంతునిచే, వాసుకిచే వదలబడిన బలాసురాత్మీయ భాగాలలో లభించునవే ఈ నాటికీ ప్రపంచంలో అత్యుత్తమ మణులుగా నెలకొనివున్నాయి. ఇవి చాలా చోట్ల నుండే వస్తున్నాయి గాని. ఏవైనా వాసుకి వదలిన, గరుత్మాన్ కదిలిన స్థానంలో పుట్టిన మణుల తరువాతనే.
రత్న విద్యా విశారదులైన విద్వజ్జనులు ఇలా వచిస్తారు. చిక్కటి ఆకుపచ్చని రంగులో కోమలకాంతులతో మెరుస్తూ, ముట్టుకొన్నా నొక్కినా గట్టిగా తగులుతూ, మధ్యభాగంలో బంగరుపొడి వున్నట్టుగా భ్రమింపజేస్తూ, సూర్యకిరణాలు గానీ వేరే ఉత్తమ కాంతులు గానీ సోకినపుడు మొత్తం మణి పచ్చగా మెరిసినా దాని మద్య భాగం నుండి సూర్యసమాన కాంతులు ఉజ్వలంగా వెలువడి తొలుతటి పచ్చదనాన్ని అధిగమించి వెలుగుతూ వుండే మరకతమణి గొప్ప ప్రభావం కలది. దానిని చూడగానే మన మనసులో ఏదో తెలియని ఆనందం ప్రవేశించి, వేళ్ళూనుకొని మనను పరవశింపజేస్తుంది. ఇంత అధికంగా మనకు ఆహ్లాదం కలిగించే శక్తి ఏ ఇతరమణికీ వుండదు. ఈ లక్షణాలున్న మరకత మణినే సకల సద్గుణవతిగా భావించాలి.
ప్రకృతి మరియు విశ్వానికి అనుగుణంగా జీవించడానికి వేదాలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి.
రాముడి వ్యూహాత్మక ఎత్తుగడలలో విభీషణునికి లంక రహస్యాల గురించిన అంతరంగిక జ్ఞానం కీలక పాత్ర పోషించింది, రావణుడిపై అతని విజయానికి గణనీయంగా దోహదపడింది. కొన్ని ఉదాహరణలు - రావణుడి సైన్యం మరియు దాని కమాండర్ల బలాలు మరియు బలహీనతల గురించిన వివరణాత్మక సమాచారం, రావణుడి రాజభవనం మరియు కోటల గురించిన వివరాలు మరియు రావణుడి అమరత్వ రహస్యం. సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించేటప్పుడు అంతర్గత సమాచారాన్ని కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యతను ఇది వివరిస్తుంది. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో, పరిస్థితి, సంస్థ లేదా సమస్య గురించి వివరణాత్మక, అంతర్గత జ్ఞానాన్ని సేకరించడం మీ వ్యూహాత్మక ప్రణాళిక మరియు నిర్ణయాధికారాన్ని గణనీయంగా పెంచుతుంది