మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే దిన-కర కుల భూషణుని దీనుడవై భజన జేసి దినము గడుపుమనిన నీవు వినవదేల గుణవిహీన కలిలో రాజస తామస గుణములు గల వారి చెలిమి గలసి మెలసి తిరుగుచు మరి కాలము గడపక నే సులభముగా కడ�....
మనసా ఎటులోర్తునే నా
మనవిని చేకొనవే
దిన-కర కుల భూషణుని
దీనుడవై భజన జేసి
దినము గడుపుమనిన నీవు
వినవదేల గుణవిహీన
కలిలో రాజస తామస
గుణములు గల వారి చెలిమి
గలసి మెలసి తిరుగుచు మరి
కాలము గడపక నే
సులభముగా కడతేరను
సూచనలను తెలియ జేయు
ఇలను త్యాగరాజ మాట
వినవదేల గుణవిహీన
manasaa e't'ulortune naa
manavini cheko'nave
dina-kara kula bhooshanuni
deenud'avai bhajana jesi
dinamu gad'upumanina neevu
vinavadela gunaviheena
kalilo raajasa taamasa
gunamulu gala vaari che'limi
galasi me'lasi tiruguchu mari
kaalamu gad'apaka ne
sulabhamugaa kad'ateranu
soochanalanu te'liya jeyu
ilanu tyaagaraaja maat'a
vinavadela gunaviheena